
బీజేపీ ఢిల్లీ శ్రేణుల్లో సంబరాలు నెలకొన్నాయి. దీన్ దయాళ్ మార్గ్‌లో కొత్తగా నిర్మించిన ఢిల్లీ బీజేపీ కార్యాలయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారంనాడు ప్రారంభించారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యాలయానికి సమీపంలోనే ఈ కొత్త కార్యాలయం ఏర్పాటు కాగా, ఇప్పటి వరకూ అద్దెకుండటం, తాత్కాలిక కార్యాలయాల్లో పని చేసిన బీజేపీ కార్యాలయానికి ఇప్పుడు సొంత కార్యాలయం రావడం, అదికూడా నవరాత్రి రోజుల్లో ప్రారంభం కావడం పార్టీ శ్రేణుల్లో సంబరాలు నింపింది.