
నందమూరి బాలకృష్ణ.. సినిమా, రాజకీయాలు రెండింటినూ సమయం, సందర్భం దొరికినప్పుడల్లా తన ప్రత్యేకను చాటుకుంటూనే ఉన్నారు. మరోసారి ఆయన వార్తల్లో నిలిచారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించే
స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా హిందూపురం బస్టాండ్ నుంచి బాలయ్య క్యాంప్ ఆఫీస్ వరకూ ఆర్టీసీ బస్సును డ్రైవింగ్ చేశారు. బస్సులో మహిళా ప్యాసింజర్లను కూర్చోబెట్టుకుని ఏకంగా రెండు కిలోమీటర్ల మేర బస్సు నడిపిన బాలయ్య.. తన ట్యాలెంట్‌ను చాటుకున్నారు.