
విజయనగరం నగరంలో డ్రంక్ డ్రైవింగ్‌పై పోలీసులు, కోర్టు కఠిన చర్యలు తీసుకుని 115 మందికి రూ.10 వేల చొప్పున జరిమానా విధించారు. ఇటీవల ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రంకన్ డ్రైవ్ నిర్వహించగా, మద్యం తాగి వాహనాలు నడిపిన 115 మంది డ్రైవర్స్‌ను పట్టుకుని కేసులు నమోదు చేశారు. అనంతరం వారిని కోర్టులో హాజరుపరిచగా, అదనపు జుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎం.ఎస్.హెచ్.ఆర్. తేజ చక్రవర్తి ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున జరిమానా విధించారు. మొత్తం రూ.11.50 లక్షలు కోర్టు ద్వారా వసూలు కావడం నగరంలో చర్చనీయాంశమైంది.