
డ్యూటీలో పోలీస్ కానిస్టేబుల్‌పై రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి సోదరుడు దాడికి పాల్పడ్డారు. బనగానపల్లెలో లక్ష్మీ నరసింహ ఆలయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన ఆయన.. తనను కానిస్టేబుల్ అడ్డుకోవడంతో ఆగ్రహించారు. కానిస్టేబుల్‌తో వాగ్వాదానికి దిగి.. సహనం కోల్పోయారు. అతడి చెంప చెల్లుమనిపించారు. దీంతో అక్కడున్నవారంతా షాకయ్యారు. ఈ వివాదంపై మంత్రి జనార్ధన్ రెడ్డి స్పందించారు జరిగిన వివాదంపై చింతిస్తున్నాను.
దాడికి పాల్పడిన వ్యక్తి ఎవరైనా సరే ఎఫ్ఐఆర్ నమోదుచేసి, చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఆదేశించినట్టు తెలిపారు.