
భారత పాకిస్తాన్ మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందంపై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. డోనాల్డ్ ట్రంప్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీజ్ ఫైర్ అమలు జరిగినా లేకపోయినా టెర్రరిస్టుల ఏరివేతను కొనసాగించాలన్నారు. పహల్గామ్ ఉగ్రవాదుల్ని విడిచి పెట్టే ప్రసక్తే ఉండకూడదన్నారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఓ బ్రోకర్ అని అసదుద్దీన్ అభివర్ణించారు. 1972 షిమ్లా ఒప్పందం నుంచి ఇప్పటి వరకు చూస్తున్నానని, అంతర్గత సమస్య కాశ్మీర్‌పై మధ్యవర్తిత్వం ఎందుకని ప్రశ్నించారు.