
నియోజకవర్గాల పునర్విభజన విధానంపై రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బిఆర్‌ఎస్ ఆందోళన చేస్తున్న నేపధ్యంలో రాష్ట్రప్రభుత్వం సోమవారం డీ లిమిటేషన్‌పై తీర్మానం పెట్టే అవకాశం ఉన్నట్లు తెలిసింది. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందంటూ ఇటీవల చెన్నైలో జరిగిన దక్షిణాది రాష్ట్రాల సమావేశానికి ఇరు పార్టీల నేతలు హాజరై తమ గళం వినిపించిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో డీ లిమిటేషన్ పై ప్రవేశపెట్టనున్న తీర్మానాన్ని శాసనసభలో ఆమోదించనున్నట్లు సమాచారం.