
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గత నెల 20వ తేదీన మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నియామక ప్రక్రియకు దరఖాస్తు గడువు నేటి (మే 15)తో ముగియనుంది. డీఎస్సీ గడువు, వయోపరిమితి, జిల్లాకు ఒకే పేపర్ విధానం కోసం అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ఇందుకోసం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అభ్యర్థులు నిరసన చేస్తున్నారు. ఏడేళ్ల తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చిందని, పరీక్షకు కనీసం 90 రోజులను సమయం ఇవ్వాలని కోరుతున్నారు. వయోపరిమితి 44 నుంచి 47 ఏళ్లకు పెంచాలని కోరుతున్నారు.