డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు నుంచి ఉండి నియోజకవర్గాన్ని కాపాడాలంటూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పొత్తూరి వెంకటేశ్వరరాజు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కు విజ్ఞప్తి చేశారు. తనను చంపించేందుకు రఘురామ కుట్ర పన్నారని చెప్పారు. తనను చంపాలని కుటుంబ సభ్యుల ఎదుటే అనుచరుడిని ఆదేశించారని తెలిపారు. ఆయన పక్కన ఉండి వ్యవహారాలు చక్కబెట్టే కొత్తపల్లి నాగరాజు సహకారంతో ఎమ్మెల్యే అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

