భారతీయులకు జర్మనీ తాజాగా గుడ్ న్యూస్ చెప్పింది. జర్మనీ మీదుగా ప్రయాణించే భారతీయులు గతంలో ట్రాన్సిట్ వీసాను తీసుకోవాల్సి వచ్చేది. ఈ నిబంధన నుంచి భారతీయులకు తాజాగా జర్మనీ మినహాయింపు ఇచ్చింది. దీంతో, భారతీయులకు అంతర్జాతీయ ప్రయాణాలు మరింత సులభతరం కానున్నాయి. దరఖాస్తులు చేసుకోవడం, వీసా కోసం వేచి చూడటం వంటి ఇక్కట్ల నుంచి విముక్తి లభించింది. భారతీయులకు వీసా ఫ్రీ ట్రాన్సిట్ సదుపాయాన్ని కల్పించినందుకు జర్మనీ ఛాన్సలర్‌కు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు.

