బ్రెజిల్ లో టోర్నడో బీభత్సం సృష్టించింది. దక్షిణ బ్రెజిల్‌లోని రియో బోనిటో డో ఇగువా పట్టణాన్ని అత్యంత శక్తివంతమైన సుడిగాలి అతలాకుతలం చేసేసింది. గంటకు 250 కిలోమీటర్ల వేగంతో వీచిన భయంకరమైన గాలులకు పట్టణం చాలావరకూ తుడిచిపెట్టుకుపోయింది. 90 శాతం పట్టణం నాశనమైంది. వందలాది ఇళ్లు దెబ్బతిన్నాయి. కార్లు గాల్లో ఎగిరి పడ్డాయి. ఈ టోర్నడో బీభత్సానికి ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. సుమారు 800 మంది గాయపడినట్లు ప్రభుత్వం తెలిపింది. ‘టోర్నడో బీభత్సం సృష్టించింది. పట్టణంలోని ఇళ్లు, పాఠశాలలను నాశనం చేసింది.

