ఓషియానియాలోని టోంగా ప్రాంతానికి సమీపంలో ఉన్న నెయాఫులో మంగళవారం (మార్చి 24) 7.6 తీవ్రతతో బలమైన భూకంపం సంభవించింది. ఇప్పటివరకు ఎలాంటి నష్టం జరిగినట్లు సమాచారం లేదు. అమెరికా జియోలాజికల్ సర్వే (USGS) ప్రకారం, ఈ భూకంపం 235 కిలోమీటర్ల కంటే ఎక్కువ లోతులో సంభవించింది.టోంగా 171 ద్వీపాలతో కూడిన ఒక ద్వీప దేశం. ఇది ఆస్ట్రేలియా తూర్పు తీరానికి సుమారు 3,500 కిలోమీటర్ల దూరంలో ఉంది.శక్తివంతమైన భూకంపం నేపథ్యంలో సునామీ హెచ్చరిక జారీ చేశారు.

