ఆదిలాబాద్ జిల్లా కేశవపట్నంలో అటవిశాఖపై పోడు రైతులు తిరగబడ్డారు. పోడు వ్యవసాయం చేస్తున్న భూముల్లో అటవిశాఖ అధికారులు మొక్కలు నాటేందుకు ప్రయత్నించడంతో ముల్తానీ పోడు రైతులు దాడులకు దిగారు. మా భూములను లాక్కొని మొక్కలు నాటుతామంటే ఊరుకునేది లేదంటూ ముల్తానీ పోడు రైతులు రాళ్లు, కర్రలతో అటవిశాఖ అదికారులు, సిబ్బందిపై దాడికి దిగారు. అడ్డొచ్చిన పోలీస్ సిబ్బంది పై సైతం దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 11 మందికి గాయాలవగా.. అటవిశాఖ, పోలీస్ శాఖకు చెందిన ప్రభుత్వ వాహనాలు ధ్వంసం అయ్యాయి.

