ఏఐఏడీఎంకే ఏకే సెంగొట్టయన్ తమిళగ వెట్రికళగం(టీవీకే) పార్టీ అధినేత విజయ్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇటీవలే ఏఐఏడీఎంకే పార్టీ నుంచి బహిష్కరణకు గురైన సెంగొట్టయన్ టీవీకేలో చేరారు. సెంగొట్టయన్ మెడలో కండువాకప్పి
సాదరంగా ఆహ్వానించారు.అనంతరం టీవీకే అధినేత విజయ్ ఎమ్మెల్యే సెంగొట్టయన్‌కు కీలక పదవి కట్టబెట్టింది. టీవీకే చీఫ్ ఆర్గనైజర్ పదవి బాధ్యతలు అప్పటించారు. సెంగొట్టయన్ 9 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 45 ఏళ్లపాటు ఏఐఏడీఎంకే పార్టీలో కొనసాగారు. ఆయన పార్టీ ప్రచార రూపకల్పన చేసిన కీలక వ్యూహకర్తగా గుర్తింపు ఉంది.

