T20 వరల్డ్ కప్ ప్రారంభమవుతున్న వేళ పురాతన నగరం వారణాసి నుంచి టీమ్ ఇండియాకు ఒక ప్రత్యేకమైన గిఫ్ట్ రెడీ అవుతోంది. వారణాసి ప్రఖ్యాత బనారసీ హ్యాండ్లూమ్ కళాకారులు, టీమ్ ఇండియాలోని 15 మంది ప్లేయర్ల కుటుంబాల కోసం ప్రత్యేకంగా ‘క్రికెట్ బనారసీ చీరలు’ నేస్తున్నారు. ఈ చీరల పల్లూ మీద క్రికెట్ పిచ్, బ్యాట్, బాల్ డిజైన్లు అద్భుతంగా రూపొందించారు. డాక్టర్ సర్వేష్ కుమార్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, ఈ చీరల థీమ్‌ను “Pride of Indian Cricket” గా రూపొందించినట్లు తెలిపారు

