లార్డ్స్ టెస్టు ఆసక్తికరంగా మారింది. తొలి ఇన్నింగ్స్‌లో ఇరు జట్లు 387 పరుగులకి ఆలౌట్ కాగా రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ జట్టు, 62.1 ఓవర్లలో 192 పరుగులకి ఆలౌట్ అయ్యింది. దీంతో నాలుగో ఇన్నింగ్స్‌లో టీమిండియా గెలవడానికి 193 పరుగులు చేయాల్సి ఉంటుంది. మరో నాలుగు సెషన్ల ఆట మిగిలి ఉండడంతో ఫలితం తేలడం ఖాయం.. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 4 వికెట్లు తీయగా జస్ప్రిత్ బుమ్రాకి 2 వికెట్లు దక్కాయి.

