మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి, పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కార్యకర్తలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ‘కాఫీ కబుర్లు’ పేరుతో నిర్వహించిన ఈ ముఖాముఖి కార్యక్రమంలో క్లస్టర్ ఇన్‌ఛార్జ్‌లతో అత్యంత ఆహ్లాదకర వాతావరణంలో రాజకీయ, పరిపాలనా అంశాలపై చర్చించారు. టీడీపీని ‘క్లీన్ పాలిటిక్స్’కు చిరునామాగా మార్చాలని పిలుపునిచ్చారు.రాజకీయాన్ని ప్రజలకు సేవ చేసే వేదికగా చూడాలి తప్ప, జీవనోపాధిగా ఎంచుకోకూడదని హితవు పలికారు.

