
ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకు కుట్ర వీడియోపై మాజీమంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు. అదంతా కోటంరెడ్డి ఆడుతున్న పెద్ద నాటకమని.. రౌడీ గ్యాంగ్లను పెంచి పోషించిందే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కాదా? ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఉన్న వ్యక్తులంతా ఎమ్మెల్యే కోటంరెడ్డి, మరో టీడీపీ నేత రూప్కు సంబంధించిన మనుషులేనని, పెరోల్ ఇప్పించే విషయంలో అడ్డంగా దొరికిపోయినందునే…ఆ అంశం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఈ కొత్త డ్రామాకు తెరలేపారని సంచలన ఆరోపణలు చేశారు.