కడపలో జరుగుతున్న మహానాడులో తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడిగా మళ్లీ ఎన్నికై చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టారు. ఆయనతో పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ప్రమాణం చేయించారు. ఉదయం జాతీయ అధ్యక్ష పదవికి నోటిఫికేషన్ విడుదల చేశారు. జాతీయ అధ్యక్ష పదవికి చంద్రబాబు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ప్రకటించారు. 1995లో చంద్రబాబు నాయుడు తొలిసారిగా టీడీపీ పగ్గాలు చేపట్టారు.

