వీరీల్స్(vreels) ఒకే చోట కంటెంట్ సృష్టి, వినోదం, సంభాషణకు డిజిటల్ వేదికగా పనిచేస్తుంది. ఇందులో ప్రతి యూజర్ ఒక క్రియేటర్ గా మారే అవకాశం ఉంది. చాట్స్, కాల్స్ కనెక్ట్ అయ్యేందుకు.. స్నేహితులతో మాట్లాడటానికి, గ్రూప్ చేయటానికి లేదా వీడియో కాల్ చేసుకోవటానికి వేర్వేరు యాప్ లు అవసరం లేదు. వీరీల్స్ లోనే ఇవన్నీ అందుబాటులో ఉన్నాయి. అమెరికాలోని తెలుగు ఇంజినీర్లు దీన్ని తయారు చేయడం విశేషం. ఇది ఇప్పటికే 22 దేశాల్లో విడుదలై, ప్రస్తుతం బీటా దశలో ఉంది.

