
జాతీయ భద్రతకు ముప్పు ఉందంటూ ఏ యాప్‌నైతే నిషేధించాలని అమెరికా సర్కార్ భావించిందో, ఇప్పుడు అదే వేదికగా తమ ప్రచారాన్ని ప్రారంభించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మంగళవారం వైట్ హౌస్ అధికారికంగా టిక్‌టాక్ ఖాతాను ప్రారంభించి, తొలి పోస్టును కూడా విడుదల చేసింది. “మేము తిరిగి వచ్చాం! వాట్స్ అప్ టిక్‌టాక్?” అనే క్యాప్షన్‌తో 27 సెకన్ల నిడివి ఉన్న వీడియోను వైట్ హౌస్ పోస్ట్ చేసింది. టిక్‌టాక్‌ను అమెరికాలో విక్రయించాలని, లేదంటే నిషేధం తప్పదని గతంలోనే ట్రంప్ చట్టం తీసుకొచ్చారు.