ప్రపంచానికి కొత్త వృద్ధి ఇంజిన్, సరఫరా గొలుసు అవసరం ఉందని ఈ డిమాండ్‌ను తీర్చడంలో భారత్, జోర్డాన్లు కలిసి కీలక పాత్ర పోషించగలవని ప్రధాని నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రధాని మూడో దేశాల పర్యటనలో భాగంగా జోర్డాన్‌లో పర్యటిస్తున్న మోదీ అమ్మాన్లో జరిగిన భారత్- జోర్డాన్ బిజినెస్ ఫోరమ్‌లో పాల్గొన్నారు. జోర్డాన్‌తో దీర్ఘకాలిక సంబంధాన్ని నిర్మించుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఒకప్పుడు గుజరాత్ నుంచి పెట్రా మీదుగా ఐరోపాకు వాణిజ్యం జరిగేదని ప్రధాని గుర్తు చేసుకున్నారు.

