
జేడీ వాన్స్ భారత పర్యటన అధికారికంగా ఖరారైంది. అమెరికా ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జేడీ వాన్స్ ఇండియాకు రావడం ఇదే తొలిసారి. జేడీ వాన్స్ సతీమణి ఉషా చిలుకూరి వాన్స్ పూర్వీకులు భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారనే సంగతి తెలిసిందే. నేపథ్యంలోనే జేడీ వాన్స్ తన భార్య ఉషా చిలుకూరి, పిల్లలు ఇవాన్, వివేక్, మీరాబెల్‌లతో కలిసి భారత పర్యటనకు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా 21న ప్రధాని మోదీతో సమావేశమవుతారని పేర్కొంది. భారత్‌లోని న్యూఢిల్లీ, జైపూర్, ఆగ్రాలలో జేడీ వాన్స్, ఆయన ఫ్యామిలీ పర్యటించనున్నారని ఆయన కార్యాలయం తెలిపింది.