ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం Student Union Elections లో వామపక్ష సంఘాలు జయభేరి మోగించాయి. బీజేపీ విద్యార్థి సంఘమైన ఏబీవీపీ(ABVP)ని సున్నాకే పరిమితం చేస్తూ ఎన్నికల్లో క్లీన్‌స్వీప్ చేశాయి. మంగళవారం జరిగిన ఎన్నికల్లో లెఫ్ట్ సంఘాలు మద్దతిచ్చిన అభ్యర్థులే నాలుగు సెంట్రల్ ప్యానెళ్లను గెలుచుకున్నారు. అధ్యక్ష పదవికి అదితి మిశ్రా ఎంపికవ్వగా.. ఉపాధ్యక్షుడిగా కీజాకుట్ గోపిక బాబు గెలుపొందారు. బ్యాలెట్ విధానంలో మంగళవారం ముగిసిన ఎన్నికల్లో విద్యార్థిలోకం ఏకపక్ష తీర్పునిచ్చింది.

