
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై తెలుగుదేశం పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. పోటీగా దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు సిద్ధంగా లేని కారణంగా పోటీ నుంచి టీడీపీ తప్పుకుంది. బీజేపీ తమ మద్ధతు కోరితే ఆలోచిస్తామన్నారు చంద్రబాబు. తెలంగాణ తెలుగుదేశం నేతలతో పార్టీ జాతీయ అధ్యక్షులు, ఏపీ సీఎం చంద్రబాబు మంగళవారం నాడు సమావేశం అయ్యారు.