నగర పరిసర ప్రాంతాల్లో వరుసగా జరుగుతున్న అగ్ని ప్రమాదాలు స్థానికులను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. జీడిమెట్ల పారిశ్రామికవాడలోని రాంరెడ్డి నగర్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అక్రమంగా నిల్వ ఉంచిన సాల్వెంట్ డ్రమ్ముల గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి వేగంగా వ్యాపించాయి.మంటల తీవ్రతతో కెమికల్ సాల్వెంట్స్తో నిండిన డ్రమ్ములు రోడ్లపై ఎగిసిపడుతూ పేలిపోవడంతో పరిస్థితి మరింత భయానకంగా మారింది. భారీగా ఎగిసిపడుతున్న మంటలు, దట్టమైన పొగ కారణంగా స్థానికులు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

