ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికంగా బలంగా పుంజుకుంటోందని.. ఏపీ బలమైన ఆర్థిక పునరుద్ధరణకు జులై నెల జీఎస్టీ వసూళ్లే కారణమంటున్నారు. 2017లో జీఎస్టీ అమలు ప్రారంభమైనప్పటి నుంచి ఇదే అత్యధికం. అలాగే ఏపీ వార్షిక వృద్ధి కూడా.. 14 శాతంగా ఉంది. అంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు. గతంలో ఏ జులైలోనూ లేనంత జీఎస్టీ వసూళ్లను ఏపీ గత నెలలో సాధించింది. అలాగే 2018 నుంచి 2025 వరకూ.. జీఎస్టీ స్థూల వసూళ్లు రూ.3,803 కోట్లు రావటం ఇదే తొలిసారి.

