జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రస్తుతం నాలుగు శ్లాబ్‌లు ఉండగా..ఇకపై రెండు శ్లాబ్‌లు మాత్రమే ఉండనున్నాయి. 12శాతం, 28శాతం శ్లాబ్‌లు తొలగింపుకు జీఎస్టీ కౌన్సిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇకపై కేవలం 5, 18శాతం శ్లాబ్‌లు మాత్రమే ఉండనున్నాయి.