సినీ గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్, సామాజిక కార్యకర్తగా పేరుగాంచిన చిన్మయి శ్రీపాద మరోసారి ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ తన పరిచయాలు, సినీ ఇండస్ట్రీలో ఉన్న పలుకుబడిని ఉపయోగించుకుని తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడని చిన్మయి ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా సోషల్ మీడియాలో సుదీర్ఘమైన పోస్టు పెట్టిన చిన్మయి.. ఈ కేసు ఎంతో క్లిష్టమైనదని, కొందరు దీన్ని “ఇద్దరి సమ్మతితో జరిగిన అంశం”గా చూపించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

