జాతీయ వేదికపై మరోసారి తెలంగాణ గర్వంగా నిలిచింది. నిర్మల్ జిల్లా తన ప్రతిభతో దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటూ ఢిల్లీ వేదికగా రెండు ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డులను సొంతం చేసుకుంది. ఆరోగ్య రంగంలో “అమ్మరక్షిత” కార్యక్రమం ద్వారా మాతృ మరణాలను గణనీయంగా తగ్గించడం గర్భిణీ స్త్రీల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టడం, నిర్మల్ జిల్లాకు ప్రత్యేక గుర్తింపైన కొయ్య బొమ్మల పరిరక్షణకు తీసుకున్న చర్యలు, రెండు రంగాల్లో సాధించిన విజయాలతో నిర్మల్ జిల్లా జాతీయ స్థాయిలో నిలిచింది.

