కర్నాటకలోని బీజేపీ ఎంపీ విశ్వేశ్వర్ హెగ్డే జాతీయ గీతంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జాతీయ గీతాన్ని బ్రిటిషన్ అధికారిని స్వాగతించేందుకు రాశారని వందే మాతరానికి మాత్రమే ప్రాధాన్యం ఇవ్వాలని ఉత్తర కన్నడ ఎంపీ సూచించారు.
ఆయన చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ మంత్రి ప్రియాంక్ ఖర్గే తీవ్రంగా స్పందిచారు. బీజేపీ ఎంపీ వ్యాఖ్యను తప్పుపట్టారు. ఇది ఆర్ఎస్ఎస్ చరిత్ర, వాట్సాప్ జ్ఞానమని అభివర్ణించారు.

