
భారతీయ సినిమా నిర్మాణానికి కేంద్రంగా హైదరాబాద్ ను నిలపాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. తెలుగు సినిమా రంగం ప్రోత్సాహాకానికి అవసరమైన చేయూతనందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. 71వ జాతీయ ఫిల్మ్ అవార్డ్సుల్లో వివిధ విభాగాల్లో ఎంపికైన సినీ ప్రముఖులు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో సోమవారం సాయంత్రం మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అవార్డు గ్రహీతలను సన్మానించారు.