లోక్‌సభ, అసెంబ్లీల ఐదేళ్ల పదవీకాలాన్ని మార్చడానికి పార్లమెంట్‌కు రాజ్యాంగబద్ధంగా అధికారం ఉందని జమిలీ ఎన్నికల బిల్లుపై అధ్యయనానికి వేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీకి లా కమిషన్ తెలిపింది. డిసెంబర్ 4న జరిగే జేపీసీ సమావేశానికి ముందు లా కమిషన్ ఈ మేరకు తన నివేదికను సమర్పించింది. దేశ ప్రయోజనాల కోసం ఈ పదవీకాలాన్ని మార్చవచ్చని, రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 83, 172లలో పేర్కొన్న కాలపరిమితి శాశ్వతం కాదని స్పష్టం చేసింది.

