
జపాన్‌లో భారీ భూకంపం వచ్చింది. హోన్షు తూర్పు తీరానికి సమీపంలో భూమి కంపించింది. దీని తీవ్రత 6.0గా నమోదయింది. 50 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించినట్లు జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ (GFZ) తెలిపింది. భూకంప కేంద్రం 10 కిలోమీటర్లు లోతులో ఉందని వెల్లడించింది. భూకంపం ధాటికి భూకంపం ధాటికి పలు చోట్ల భవనాలు దెబ్బతిన్నాయి. కొన్ని చోట్ల పాక్షికంగా కూలిపోయాయి. తీర ప్రాంతం కావడం వల్ల సముద్రం అల్లకల్లోలానికి గురైంది.