నెల్లిమర్ల జనసేన ఎమ్మెల్యే లోకం మాధవి లోకం మాధవికి చెందిన ‘మిరాకిల్ సాఫ్ట్వేర్’ సంస్థ ద్వారా ఉద్యోగులకు ఇచ్చే రెగ్యులర్ జీతంతో సంబంధం లేకుండా, ఒక్కో ఉద్యోగి ఖాతాలో అదనంగా రూ. 1 లక్ష నుంచి రూ. 2 లక్షల వరకు జమ చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నిధులను ఎన్నికల ఖర్చు కోసం లేదా ఓటర్లను ప్రలోభపెట్టడానికి మళ్లించారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశించింది.

