మేడారంలో కొలువుదీరిన వనదేవతలను దర్శించుకునేందుకు భక్తజనం లక్షలాదిగా తరలివస్తూనే ఉన్నారు. నిండు జాతరలో తల్లులను చూసి తన్మయత్వం పొందుతున్నారు. కోరిన కోర్కెలు తీర్చే ఇలవేల్పునకు నిలువెత్తు బంగారం సమర్పించి సంతోషంగా మొక్కులు చెల్లించుకుంటున్నారు. శనివారం సమ్మక్క- సారక్క అమ్మవార్లు వన ప్రవేశంతో మేడారం జాతర పరిమాసప్తం కానుంది. సామాన్య భక్తులతో పాటు పలువురు ప్రముఖులు ఆదివాసీల ఇష్టదైవాన్ని నిండు మనసుతో కొలిచారు. జాతరలో ప్రధాన ఘట్టమైన సమ్మక్క గద్దె మీదకు రావటంతో ఈరోజు భారీగా రద్దీ పెరిగింది.

