ఉద్యమకారులకు న్యాయం జరిగే వరకు కోట్లాడలేకపోయినందుకు నేను బహిరంగ క్షమాపణ చెప్తున్నాను. అమరవీరుల కుటుంబాలకు కోటి రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా’ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.‘ తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత ‘జాగృతి జనం బాట’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమం ద్వారా ఎమ్మెల్సీ కవిత జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు.అక్టోబర్ 25న ప్రారంభమైన ఈ జాగృతి జనంబాట యాత్ర 2026 ఫిబ్రవరి 13 వరకు సాగనుంది.

