
తన పిల్లల ఉన్నత చదువుల కోసం యూరప్ వెళ్లేందుకు జగన్ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అక్టోబర్ నెలలో 1 నుంచి 30 వరకు వెళ్లేలా అనుమతి ఇవ్వాలని ఆయన కోరారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన కోర్టు యూరప్ పర్యటనకు ఆమోదం ఇచ్చింది. పర్యటన పూర్తయ్యాక, జగన్ వ్యక్తిగతంగా సీబీఐ కోర్ట్ ముందు హాజరు కావాలని స్పష్టం చేసింది. నవంబర్ 1 నుంచి 14 మధ్యలో జగన్ కోర్ట్ ముందు హాజరై తన పరిస్థులను వివరించాలని ఆదేశించింది.