టి20 వరల్డ్ కప్లో భాగంగా పాక్-టిమిండియా జరిగిన మ్యాచ్ను ఎపి మంత్రి నారా లోకేష్ కొలంబో స్టేడియంలో వీక్షించారు. ప్రభుత్వ సొమ్మును మంత్రి లోకేష్ వృధా ఖర్చు చేస్తున్నారని వైసిపి నేతలు సోషల్ మీడియాలో ప్రచారం చేశారు.
దీంతో నారా లోకేష్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు. ఫ్లైట్ టికెట్ తనదేనని, మ్యాచ్ టికెట్ కూడా తనదేనని అని తెలిపారు. తన దుడ్లతోనే మ్యాచ్ చూశానని, వైసిపి అధినేత జగన్ దుడ్లను ఏమైనా ఖర్చు చేశానా? అని ప్రశ్నించారు.

