
ఛత్తీస్‌గఢ్ గరియాబంద్ జిల్లాలో భద్రతా బలగాలు చేపట్టిన మేజర్ ఆపరేషన్‌లో 10 మంది మావోయిస్ట్‌లు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో కీలక నేతలు ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఇందులో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు మనోజ్ అలియాస్ మోడెం బాలకృష్ణ ఉన్నారని భద్రతా దళ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. మోడెం బాలకృష్ణ స్వస్థలం తెలంగాణ కావడం గమనార్హం. ఇతడిపై కోటి రూపాయల రివార్డ్ ఉన్నట్లు తెలిపారు.ఒడిశా రాష్ట్ర కమిటీ సభ్యుడు ప్రమోద్ అలియాస్ పాండు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. భారీ మొత్తంలో ఆయుధాలను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.