ఓ యువకుడు చైనా మాంజా బారిన పడి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు.సాఫ్ట్‌వేర్ ఉద్యోగి చైతన్య (27) చైనా మాంజా తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. బొటానికల్ గార్డెన్ ఫ్లైఓవర్ మీదుగా హఫీజ్‌పేట్ వైపు తన బైకుపై వెళ్తుండగా.. ఒక్కసారిగా చైనా మాంజా అతడికి తగలడంతో.. చైతన్యకు భుజం నుంచి ఛాతి వరకు తీవ్ర గాయాలయ్యాయి. మాంజా ఛాతికి తగలడంతో తృటిలో ప్రాణాపాయం తప్పింది. అదే గొంతుకు తగిలి ఉంటే ప్రాణాలు పోయేవని వైద్యులు తెలిపారు.

