మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్న విపక్షాలపై కోయంబత్తూర్ సభలో ప్రధాని నరేంద్ర మోదీ నిప్పులు చెరిగారు. మహిళల కోసం చేసిన మంచి ప్రయత్నాన్ని విపక్షాలు అడ్డుకున్నాయని, చేసిన తప్పులకు విపక్షాలు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. మహిళల అభ్యున్నతి కోసం తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. బిల్లును అడ్డుకున్నందుకు డీఎమ్‌కే నేతలను ప్రజలు ప్రశ్నించాలన్నారు. సామాన్య మహిళలను ఎంపీ, ఎమ్మెల్యేలను చేయడమే తన సంకల్పమన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు క్రెడిట్‌ను విపక్షాలే తీసుకోవాలని కోరానని చెప్పారు.

