మెగాస్టార్ చిరంజీవి, దళపతి విజయ్ ఎవరు బెస్ట్ డాన్సర్? అనే ప్రశ్నకు విజయ్ పేరు చెప్పడంతో కీర్తి సురేష్ ట్రోలింగ్‌కు గురైంది. నేను విజయ్ గారి పేరు ఎందుకు చెప్పాను అంటే… ఆయన సినిమాలు ఎక్కువ చూశాను. అంతే తప్ప చిరంజీవి గారిని తక్కువ చేసే విధంగా నేను మాట్లాడలేదు. దీని గురించి చిరంజీవి గారితో డిస్కస్ చేశా. నా నిజాయితీని చిరంజీవి గారు మెచ్చుకున్నారు. ఒకవేళ అభిమానుల మనసు నోచుకున్నట్లు అయితే వాళ్లు గనక హర్ట్ అయితే సారీ చెబుతున్నాను” అని అన్నారు.

