
అమెరికాలో కన్జర్వేటివ్ కార్యకర్త చార్లీ కిర్క్ హత్య కేసులో పెద్ద మలుపు చోటుచేసుకుంది. హత్య కేసులో ఒక అనుమానితుడిని అరెస్టు చేసినట్లు శుక్రవారం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. నిందితుడిని అరెస్టు చేయడంలో సహాయం చేసింది అతని సన్నిహితుడేనని, అతనే పోలీసులకు అప్పగించాడని ట్రంప్ చెప్పారు. మేము వెతుకుతున్న వ్యక్తిని పట్టుకున్నామని మేము భావిస్తున్నాము.” న్యూయార్క్ పోస్ట్ ప్రకారం, చార్లీ కిర్క్ హత్య కేసులో అనుమానితుడు టైలర్ రాబిన్సన్ అని గుర్తించారు.