
చాట్‌జీపీటీ కారణంగానే తమ 16 ఏళ్ల కుమారుడు ఆత్మహత్య చేసుకుని మరణించాడని ఆరోపిస్తూ.. ఓపెన్ఏఐ , ఆ సంస్థ సీఈఓ సామ్ ఆల్తమస్‌పై తల్లిదండ్రులు దావా వేయడం సంచలనంగా మారింది. తమ కుమారుడు ఆడమ్ రైన్ చనిపోవడానికి కొన్ని నెలల ముందు చాట్‌జీపీటీలో ఆత్మహత్య గురించి సెర్చ్ చేశాడని ‘చాట్‌బాట్ ఆడమ్ ఆత్మహత్య ఆలోచనలను ధ్రువీకరించడమే కాకుండా ప్రాణాంతక పద్ధతులపై నిర్దిష్ట వివరాలను అందించింది.. తల్లిదండ్రుల క్యాబిన్ నుంచి మద్యం ఎలా పొందాలో అతడికి సూచించింది.. సూసైడ్ నోట్‌ను రాయడానికి కూడా సహకరించింది.. తల్లిదండ్రులు పేర్కొన్నారు.