
చలో బస్ భవన్‌కు బీఆర్‌ఎస్ పిలుపునిచ్చింది. ముందస్తు చర్యల్లో భాగంగా కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అలాగే వివేకానంద గౌడ్, శంభీర్ పూర్ రాజు, సాయుబాబా తదితరులను కూడా గృహనిర్బంధం చేశారు పోలీసులు. మాజీ మంత్రి , మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.