మార్కాపురం జిల్లా కనిగిరి మండలం తాళ్లూరు ఎంపీపీ స్కూల్‌లో దద్దాల శ్రీనివాస్ హెడ్‌మాస్టర్‌గా పనిచేస్తున్నారు. గతేడాది డిసెంబర్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు పిల్లల్ని కనాలంటూ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దద్దాల శ్రీనివాస్ ముఖ్యమంత్రి చంద్రబాబును అవమానించేలా పోస్టులు పెట్టారంటూ టీడీపీ కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదుతో దద్దాల శ్రీనివాన్‌పై క్రిమినల్ కేసు నమోదైంది. ఈ క్రమంలో శ్రీనివాస్‌ను సస్పెండ్ చేస్తూ మార్కాపురం జిల్లా ఇంఛార్జ్ డీఈవో సీవీ రేణుక ఆదేశాలు జారీచేశారు.

