మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్… ఏపీ సీఎం చంద్రబాబుకు బర్త్ డే విషెష్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఇది వైరల్ అవుతోంది.
‘ఏపీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు మామయ్య గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యం, ఆనందంతో ఉండాలని… అదే అంకిత భావంతో దార్శనికతతో మన ప్రజలకు నాయకత్వం వహించి, సేవ చేసే శక్తిని పొందాలని ఆకాంక్షిస్తున్నాం. రాష్ట్ర అభివృద్ధి, సుసంపన్నత, ఆత్మగౌరవంతో మీ నాయకత్వం కొనసాగాలని… నిరంతరం స్ఫూర్తినివ్వాలని కోరుకుంటున్నాను.’ అంటూ ట్వీట్ చేశారు.

