ఏపీ సీఎం చంద్రబాబు కుట్రలు పన్ని లక్షల, కోట్ల విలువ చేసే మెడికల్ కాలేజీ భూముల్ని వంద రూపాయలకే విక్రయిస్తున్నాడని ఆరోపించారు. 50 ఎకరాల మెడికల్ కాలేజీ భూముల వల్ల రాష్ట్రానికి లక్షల కోట్ల ఆదాయం వస్తుందని తెలిపారు.
పేద విద్యార్థులు డాక్టర్లు అవ్వడానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ప్రైవేటీకరణ వల్ల 2150 మెడికల్ సీట్లు కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పులివెందులలో 50 సీట్ల మెడికల్ కాలేజీ పూర్తయినా చంద్రబాబు . అడ్డుకుని నేషనల్ కౌన్సిల్‌కు లేఖ రాశారని మాజీ మంత్రి పెద్దిరెడ్డి మండిపడ్డారు.

