సినిమాల పైరసీ కేసులో ‘ఐబొమ్మ’ రవి చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యాడు. తెలంగాణ హైకోర్టు మంగళవారం అతడికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఇమంది రవి ఎట్టి పరిస్థితుల్లోనూ దేశం విడిచి వెళ్లొద్దని తన పాస్‌పోర్టును కోర్టులో సరెండర్ చేయాలని ఆదేశించింది. ప్రతి రోజు ఉదయం 11 గంటలకు సిసిఎస్ పోలీసుల ఎదుట హాజరు కావాలని స్పష్టం చేసింది. ఈ కేసులో గతేడాది నవంబర్‌లో రవి అరెస్టయిన విషయం తెలిసిందే.

