బిహార్ రాష్ట్రంలో పెను విషాదం చోటుచేసుకుంది. కటిహార్ జిల్లాలో జరిగిన ఒక భయంకరమైన రోడ్డు ప్రమాదంలో 13 మంది ప్రాణాలు కోల్పోగా, కటిహార్ జిల్లాలోని NH-31 పై ఒక బస్సు, పికప్ వ్యాన్ మరియు ట్రక్కు ఒకదానికొకటి బలంగా ఢీకొనడంతో ఈ మారణకాండ సంభవించింది. బస్సు డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడమే ఈ ఘోర ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమిక సమాచారం అందుతోంది. మరో 30 మంది ప్రయాణికులు తీవ్ర గాయాలపాలవడంతో వారిని సమీప ఆసుపత్రికి తరలించారు.

